కరీంనగర్: BJP కార్పొరేటర్ ఇంటి ముట్టడికి BRS యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం... ఆందోళకారులు అరెస్ట్

కరీంనగర్: BJP కార్పొరేటర్ ఇంటి ముట్టడికి BRS యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం... ఆందోళకారులు అరెస్ట్
  • గంగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్​ఎస్​ కార్యకర్తల ఆగ్రహం

కరీంనగర్‌‌‌‌, వెలుగు: మాజీ మంత్రి, కరీంనగర్‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ కార్పొరేటర్‌‌‌‌ బండారి వేణు సోషల్‌‌‌‌ మీడియాలో వీడియో పోస్టు చేయడంపై బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం వేణు ఇంటిని ముట్టడించేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్పొరేటర్‌‌‌‌ బండారి వేణును అదుపులోకి తీసుకున్నారు. వేణు ఇంటిపై దాడి చేస్తామని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ శ్రేణులు హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు తమ వెంట తీసుకెళ్లారు.

 ఎమ్మెల్యే గంగులను అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టు చేసిన బండారి వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌‌‌‌ పొన్నం అనిల్‌‌‌‌గౌడ్‌‌‌‌ కరీంనగర్‌‌‌‌ టూటౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.