మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ రిలీజ్: గేమ్ ఆఫ్ థ్రోన్స్ – ద ఫైనల్ సీజన్

మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ రిలీజ్: గేమ్ ఆఫ్ థ్రోన్స్ – ద ఫైనల్ సీజన్

యూఎస్ లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా.. టెలివిజన్ ఫినామినన్ గా మారిపోయింది టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్’. ఈ సిరీస్ లో చివరిదైన ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూశారు. ఫస్ట్ లుక్స్, మోషన్ పిక్చర్స్, టీజర్లతో ఇప్పటికే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ టీవీ ఫాంటసీ డ్రామా సిరీస్. ఈ టీవీ సిరీస్ లోని చివరి పార్ట్ “గేమ్ ఆఫ్ థ్రోన్స్ : సీజన్ 8- ద ఫైనల్ సీజన్” ఈ ఏడాది ఏప్రిల్ 14న HBO లో తొలిసారి ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన తొలి ఫుల్ ట్రైలర్ మంగళవారం నాడు విడుదలైంది. రిలీజైన కొద్దిసేపటికే.. లక్షలు, కోట్లలో వ్యూస్, లైక్స్ సంపాదించుకుంది ఈ ట్రైలర్.

సెంటిమెంట్.. యాక్షన్.. ఫాంటసీ.. నమ్మలేని అంతా కొత్త ప్రపంచం.. ప్రేక్షకులను ఉద్వేగానికి లోనుచేస్తూ.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 2011 ఏప్రిల్ 17న సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడ్ HBOలో యూఎస్ లో ప్రసారమైంది. 2017 ఆగస్ట్ 27న ఏడో సీజన్ ప్లే అయింది. అన్ని ఎపిసోడ్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వచ్చింది. విమర్శకులనుంచి బెస్ట్ మార్కులు పడ్డాయి.

ఏప్రిల్ 14 నుంచి.. ఏప్రిల్ 21, ఏప్రిల్ 28, మే 5, మే 12, మే 19 తేదీల్లో ఆరు ఎపిసోడ్స్ గా సీజన్ 8 ప్రసారం కానుంది. టీవీ సిరీస్ లోనే టాప్ సిరీస్ గా పేరుతెచ్చుకున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ తాజా ట్రైలర్ కూడా సూపర్ గా ఉందంటున్నారు ప్రేక్షకులు. టీవీలో రాబోయే ఫైనల్ సీజన్ ప్రీమియర్ షో కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.