గాంధీ దవాఖానలో వైద్య సేవలు భేష్ .,.సంతృప్తి వ్యక్తం చేసిన మానవ హక్కుల కమిషన్‌‌‌‌

గాంధీ దవాఖానలో వైద్య సేవలు భేష్ .,.సంతృప్తి వ్యక్తం చేసిన మానవ హక్కుల కమిషన్‌‌‌‌

పద్మారావునగర్​, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయని, పేషెంట్లకు అధునాతన వైద్యం అందిస్తున్న డాక్టర్ల కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ చైర్మన్​ డాక్టర్​ జస్టిస్​ షమీమ్ అక్తర్​ అన్నారు. గురువారం కమిషన్​ మెంబర్లు శివాది ప్రవీణ, డాక్టర్​ బి.కిషోర్​తో కలిసి ఆయన గాంధీ హాస్పిటల్​ను విజిట్​ చేశారు. ఎమర్జెన్సీ వార్డును సందర్శించి పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

 జీరియాట్రిక్, పీడీయాట్రిక్​ సర్జరీ వార్డులను సందర్శించారు. పిల్లల వార్డులో అధునాతన వైద్య సౌకర్యాలను చూసి మానవ హక్కుల కమిషన్​ సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం సూపరింటెండెంట్‌‌‌‌చాంబర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్‌‌‌‌ షమీమ్‌‌‌‌ అక్తర్‌‌‌‌ మాట్లాడారు.

 గాంధీ ఆస్పత్రి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్​ సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఇందిరా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్​ సునీల్, ఆర్​ఎంవోలు డాక్టర్​ శేషాద్రి, డాక్టర్​ యోగేందర్, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్​హెచ్​వో అనుదీప్, కమిషన్‌‌‌‌ కార్యదర్శి, సీఈవో 
కాంతి వెస్లీ పాల్గొన్నారు.