యూపీలో మరో గ్యాంగ్ స్టర్ రాకేశ్ పాండే హతం

యూపీలో మరో గ్యాంగ్ స్టర్ రాకేశ్ పాండే హతం
  • బీజేపీ నేత కృష్ణానంద్ రాయ్ హత్య కేసు నిందితుడు మృతి

యూపీలో మరో గ్యాంగ్ స్టర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు . లక్నో దగ్గర లోని సరోజినగర్ ప్రాంతంలో రాకేశ్ పాండే అలియాస్ హనుమాన్ పాండేను ఆదివారం ఉదయం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హతమార్చారు. పాండేను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా అతడు తమపై కాల్పులు జరిపాడని, దీంతో తాము జరిపిన ఎదురుకాల్పుల్లో పాండే హతమైనట్లు పోలీసులు తెలిపారు. యూపీలో 2005లో జరిగిన బీజేపీ నేత కృష్ణా నంద్ రాయ్ హత్య కేసులో రాకేశ్ పాండే నిందితుడుగా ఉన్నాడు. మాఫియా డాన్ నుంచి పొలిటీషియన్ గా మారిన బీఎస్పీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీకి అత్యంత నమ్మదగిన వ్యక్తుల్లో పాండే ఉన్నాడని,  మరో డాన్ మున్నా బజరంగీ గ్యాంగ్ లో గత 20 ఏళ్లకు పైగా రాకేశ్ కీలక సభ్యుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. షార్ప్ షూటర్ అయిన రాకేశ్ పలు మర్డర్లు, కాల్పుల ఘటనల్లో స్వయంగా పాల్గొన్నాడని, ఇతర గ్యాంగ్ స్టర్లతోనూ హింసాత్మక ఘటనల్లో అతని ప్రమేయం ఉందని తెలిపారు. రాకేశ్ పై యూపీలో ఇప్పటికే 12 వరకు క్రిమినల్ కేసులున్నాయి . ఈ మధ్యే యూపీలోని కాన్పూర్ లో గ్యాంగ్ స్టర్ ర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.