Gangster-Terrorist Nexus Case: ఆరు రాష్ట్రాల్లోని 100 చోట్ల ఎన్ఐఏ దాడులు

Gangster-Terrorist Nexus Case: ఆరు రాష్ట్రాల్లోని 100 చోట్ల ఎన్ఐఏ దాడులు

గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. తాజాగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా ఆరు రాష్ట్రాల్లోని 100 చోట్ల దాడులు నిర్వహించింది. ఖలిస్తానీ అంశాలతో ఉన్న సంబంధాలపై కూడా ఏజెన్సీ విచారణ జరుపుతోంది. గతేడాది ఎన్ఐఏ దాఖలు చేసిన Rs 37, 38, 39/2022/NIA/DLI అనే 3 వేర్వేరు కేసులకు సంబంధించి ఈ దాడులు నిర్వహించబడుతున్నాయి.  టెర్రర్-నార్కోటిక్స్ స్మగ్లర్లు-గ్యాంగ్‌స్టర్స్ నెక్సస్ కేసులలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి,

దేశంలో ఉగ్రవాద చర్యలను ప్లాన్ చేయడంలో , అమలు చేయడంలో ఖలిస్తానీ గ్రూపులతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉందని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లకు ప్రతిస్పందనగా NIA ఈ దాడులు నిర్వహిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నెట్‌వర్క్‌ను వెలికితీయడం, వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ఈ ఏజెన్సీ లక్ష్యం. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే క్రిమినల్ నెట్‌వర్క్‌లను కూల్చివేయడానికి NIA చేస్తోన్న ప్రయత్నాలలో ఈ ఆపరేషన్ ఒక కీలకమైందిగా తెలుస్తోంది.