స్టూడెంట్లు, వలస కూలీలు టార్గెట్గా గంజాయి అమ్మకం

స్టూడెంట్లు, వలస కూలీలు టార్గెట్గా గంజాయి అమ్మకం
  • నలుగురిని అరెస్ట్ చేసిన పెద్దపల్లి జిల్లా పోలీసులు
  • రూ.7.50 లక్షల విలువైన15 కిలోల గంజాయి స్వాధీనం

గోదావరిఖని, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముఠాను పెద్దపల్లి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రామగుండం సీఐ ప్రవీణ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని కమాన్​పూర్​మండలం రొంపికుంటకు చెందిన చిందం సాయిప్రదీప్, తౌట శివకుమార్, మహబూబాబాద్ మండలం జంగిలికొండకు చెందిన జక్క యశ్వంత్, భూపాలపల్లి సుభాష్​నగర్​కు చెందిన జంగపల్లి కమల్ ముఠాగా ఏర్పడ్డారు.

ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనితెచ్చి ఇతర రాష్ట్రాల వలస కూలీలు, స్టూడెంట్లను టార్గెట్గా చేసుకుని అమ్ముతున్నారు. సోమవారం బుగ్గగుట్ట అటవీ ఏరియాలోని కుందనపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా..  అంతర్గాం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద 15 కిలోల గంజాయి దొరకగా.. రూ.7.50 లక్షల విలువ ఉంటుంది.  రెండు బైక్​లు, ఏడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  ఒడిశాకు చెందిన మరో నిందితుడు అలెక్స్  పరారీలో ఉన్నాడని సీఐ ప్రవీణ్ తెలిపారు. ఎస్ఐ వెంకటస్వామి, సిబ్బంది​ఉన్నారు.