యాలాలలో చైన్ స్నాచర్ల హల్చల్

యాలాలలో చైన్ స్నాచర్ల హల్చల్
  • వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
  • మహిళా కండక్టర్​పై దాడికి యత్నం!

తాండూర్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాలలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సంగమేశ్వర కాలనీకి చెందిన శ్యామమ్మ (60) మంగళవారం ఉదయం తన ఇంటి ముందు పని చేసుకుంటుండగా, ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. అలాగే తాండూరు ఆదర్శనగర్​లో డ్యూటీకి వెళ్తున్న ఓ మహిళా కండక్టర్​ను అడ్డుకుని ఆమె గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.