అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇరాన్ పై మరో రెండు వారాలపాటు దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని రెండు వారాల పాటు తెరిచేందుకు అంగీకరిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి తెలిపింది.
ఇరాన్‌పై సైనిక దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కు ఇచ్చిన గడువుకు కేవలం 90 నిమిషాల ముందు తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా ఈ ప్రకటన చేశారు. ఈ చర్యను ట్రంప్ ద్వైపాక్షిక కాల్పుల విరమణ గా అభివర్ణించారు..ఈ కాలంలో ఇరు దేశాలు ఎలాంటి కాల్పులు జరుపవని అన్నారు.
మరోవైపు రానున్న రెండు వారాలపాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చి చెప్పారు. టెక్నాలజీ పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ.. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమలులో 14 రోజులు హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తునట్టు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు నిలిపివేస్తే తమ ఆర్మీ కూడా దాడులు నిలిపివేస్తుందని అన్నారు. ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా అంగీకరించిందని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ వినతితో ఇరాన్ గడువును 14 రోజులు పొడిగిస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు.
