టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. 2021 టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యార్ కంటే ప్రతిభావంతుడన్నారు. సూర్యకుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. 4వ స్థానంలో ఆడటం అంత ఈజీ కాదని..సూర్యకుమార్ 4వ స్థానంలో ఏ బ్యాట్స్ మెన్ ఆడని షాట్లను సూర్యకుమార్ ఆడతాడన్నారు.టీ20లకు సూర్య లాంటివాడే కావాలన్నారు. సూర్యకుమార్ యాదవ్ నాల్గవ స్థానంలో రాణిస్తాడని..అతడు మైదానం నలువైపులా షాట్లు ఆడగలడన్నారు.

