రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల

రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదంతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. లేటెస్టుగా చట్టం అమలు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి(మార్చి-30) నుంచే చట్టం అమల్లోకి వస్తున్నట్లు గెజిట్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ 61ఏళ్ల వరకు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు.