
ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి యాతా ప్రవీణ్ కుమార్. ఉప్పల్ భగాయత్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కు NOC (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడానికి రామంతాపూర్‌కు చెందిన బిల్డర్ గోపగాని రమణమూర్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు ప్రవీణ్ కుమార్.
ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం సికింద్రాబాద్ బుద్ధభవన్ లో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు మోసపూరితంగా వ్యవహరించారన్న అభియోగంపై ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఆయన్ను హాజరు పరిచారు.