ఎర్లీబడ్ ఆఫర్.. జీహెచ్ఎంసీకి 4 రోజుల్లోనే 55 కోట్ల ఆదాయం

ఎర్లీబడ్ ఆఫర్.. జీహెచ్ఎంసీకి 4 రోజుల్లోనే 55 కోట్ల ఆదాయం

ఎర్లీ బడ్ స్కీం ఆఫర్ జీహెచ్ఎంసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఏప్రిల్ 30 వరకు ఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించడంతో గ్రేటర్ వాసులు భారీగా పన్ను చెల్లి్స్తున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ లో 4 రోజుల్లోనే  55 కోట్ల రూపాలయ పన్నుల వసూల్ అయ్యింది. ఒక్క  శేరిలింగంపల్లి జోన్ లో అత్యధికంగా 11 కోట్ల రూపాయల ఆస్తిపన్ను చెల్లించారు.  

ఎర్లీబర్డ్  స్కీం ఆఫర్ కింద ఈ సారి 750 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు చేయడమే  లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ. గత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి  741 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఏప్రిల్ 30 లోపు  ఒకే సారి చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది జీహెచ్ఎంసీ,