Raayan First Single: మ‌ట‌న్ కొట్టు రాయ‌న్‌ సాంగ్ విన్నారా..ధనుష్ రాసి పాడిన అడంగాత అసురన్

Raayan First Single: మ‌ట‌న్ కొట్టు రాయ‌న్‌ సాంగ్ విన్నారా..ధనుష్ రాసి పాడిన అడంగాత అసురన్

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు.ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ రాయన్. ఇది ధనుష్ కెరియర్లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్,ఫస్ట్ లుక్‍ పోస్టర్ రిలీజ్ చేయగా..ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన అడంగాత అసురన్ అదిరిపోయింది.ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచి పాడిన ఈ గీతాన్ని ధనుష్ తో క‌లిసి పాడారు. ఈ పాటకు ధ‌నుష్ స్వ‌యంగా లిరిక్స్ అందించాడు. ఇక ధనుష్ ఫ్యాన్స్ హమ్ చేసే క్షణం ఆగాయే. మ‌ట‌న్ కొట్టు రాయ‌న్‌ సాంగ్ విని ఎంజాయ్ చేసేయండి. 

ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తమిళం,తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 13న గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్, పీటర్ హైన్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా వ్యవహరించాడు.ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర మూవీలో నటిస్తున్నాడు.