హైలెవల్ కమిటీ రిపోర్టులోని 25 అంశాలను అమలు చేయాలి : మేయర్

హైలెవల్ కమిటీ రిపోర్టులోని 25 అంశాలను అమలు చేయాలి : మేయర్

హైలెవల్ కమిటీ రిపోర్టులోని 25 అంశాలను అమలు చేయాలి

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశం

హైదరాబాద్, వెలుగు : వీధి కుక్కల నియంత్రణకు హై లెవల్ ​కమిటీ ఇచ్చిన రిపోర్టులోని 26 అంశాల్లో 25 అమలు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల్​విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం బల్దియా హెడ్డాఫీసులో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యులతో మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక పరమైన అంశాలను కౌన్సిల్ సమావేశంలో తీర్మానించి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని, మిగిలిన అంశాలను అమలు చేస్తామని చెప్పారు.

లాప్రోస్కోపీ ద్వారా కుక్కలకు సర్జరీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని కమిటీ సభ్యులు చేసిన సూచన మినహా మిగిలిన అంశాలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైలెవల్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్లు, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.