Turbo Release Date: మమ్ముట్టి టర్బో మోడ్ ముందే యాక్టివేట్..రిలీజ్ డేట్లో మార్పు

Turbo Release Date: మమ్ముట్టి టర్బో మోడ్ ముందే యాక్టివేట్..రిలీజ్ డేట్లో మార్పు

72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి(Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad). కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన క‌న్నూర్ స్క్వాడ్‌ మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేర‌ళ‌ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది.అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా..అలాగే చీకటి యుగాల నేపథ్యంలో వచ్చిన భ్రమయుగం మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.

ప్రస్తుతం మమ్ముట్టి టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.అయితే తాజా సమాచారం ప్రకారం..టర్బో చిత్రాన్ని మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే ముందుగా ఈ చిత్రాన్ని జూన్‌ 13న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ షేర్ చేయగా..మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్న లుక్ తెగ వైరల్ అయింది.మమ్ముట్టి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అవతారంలో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

దీంతోపాటు మమ్ముట్టి బజూక సినిమాలో కూడా నటిస్తున్నాడు.ప్రస్తుతం బజూక పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉండగా..మరో మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.