
టాలీవుడ్ ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసిన సినిమా ‘బాహుబలి’(Baahubali). దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రంలో.. రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాండ్సమ్ హంక్ రానాతోపాటు రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, బాహుబలి సిరీస్ కు కొనసాగింపుగా బాహుబలి 3 రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘పార్ట్ 3’ గురించి తనకు తెలియదంటూ ప్రభాస్ ఇటీవల స్పందించాడు. సమయం వచ్చినప్పుడు ఏమైనా జరగొచ్చన్నాడు.
ఇదిలా ఉండగా..గతంలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి..బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. 'తనకు మూడో పార్ట్ చేయాలనుందన్నాడు. అలాగే బాహుబలి చుట్టూ ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది అని కూడా చెప్పాడు జక్కన్న.
లేటెస్ట్గా దర్శకుడు రాజమౌళి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’(Baahubali Crown of Blood) అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని చెప్పారు. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే రానుందని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి వెల్లడించారు.
“మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు..ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది”. అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఇక బాహుబలిని వేరే రూపంలో తీసుకురావడం సాధ్యం కాదని కూడా రాజమౌళి చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ తో అది ఏమి చూపిస్తుంది..? అనేది తెలియాల్సి ఉంది. బాహుబలి, కట్టప్ప, శివగామి, భల్లాలదేవ, దేవసేన పాత్రలు ఇందులో ఎలా ఉండబోతున్నాయి.? ఇంకా ఏవైనా కొత్త పాత్రలు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అనే పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.
— rajamouli ss (@ssrajamouli) April 30, 2024
Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld