హైదరాబాద్ లో కలకలం: అర్థరాత్రి విగ్రహంతో నగ్నంగా పరుగెత్తి.. చెరువులో శవమై తేలిన యువతి

హైదరాబాద్ లో   కలకలం: అర్థరాత్రి విగ్రహంతో  నగ్నంగా పరుగెత్తి.. చెరువులో శవమై తేలిన యువతి

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని శంకర్ నగర్‌లో తీవ్ర కలకలం రేగింది. శంకర్ నగర్‌లోని ఒక ఇంట్లో తల్లి, కూతురు అద్దెకు ఉంటున్నారు. అయితే  ఆ ఇంటి యజమాని దగ్గర ఆఫీస్ పర్పస్ కోసం అని చెప్పి లీజుకు తీసుకున్న ఒక వ్యక్తి.. ఆ తర్వాత ఆ ఇంటిని ఓ యాప్ ద్వారా వీరికి సబ్-రెంట్ (అద్దెకు) ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

అయితే నిన్న అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లో ఊహించని ఘోరం జరిగింది. ఇంట్లోనే ఉన్న తల్లిని బయట నుంచి తాళం వేసిన  యువతి నగ్నంగా రోడ్డుపైకి పరుగులు తీసింది. తీవ్ర ఆందోళనతో బయటకు వచ్చిన ఆమె, సమీపంలో ఉన్న ఒక గుడిలోకి వెళ్లి అక్కడి విగ్రహాన్ని కూడా తీసుకువెళ్లినట్లు స్థానికులు లబోదిబోమంటున్నారు.

కట్ చేస్తే... తెల్లవారేసరికి ఆ యువతి పక్కనే ఉన్న పీర్జాదిగూడ చెరువులో శవమై తేలింది. అర్ధరాత్రి అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? యువతి అంతలా భయపడి నగ్నంగా ఎందుకు పరుగులు తీసింది? మానసిక స్థితి సరిగ్గా లేక ఇలా చేసిందా, లేక దీని వెనుక మరేదైనా విస్తుపోయే నిజాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.