అమ్మాయిలా మజాకా: మా జోలికొస్తే బరాబర్ కొడుతాం

అమ్మాయిలా మజాకా: మా జోలికొస్తే బరాబర్ కొడుతాం

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు ఇద్దరు అమ్మాయిలు. తమ స్కూటీని ఢీకొట్టాడని ఓ క్యాబ్ డ్రైవర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టడమేకాక.. ఓ నాలుగు దెబ్బలు కొట్టారు. ఎందుకు కొట్టారని క్యాబ్ డ్రైవర్ ఆ అమ్మాయిలని అడగగా.. బరాబర్ కొడుతాం.. మా జోలికి వస్తే ఊరుకోం అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. జస్ట్ స్కూటీని టచ్ చేసినందుకే కొడుతారా అని ప్రశ్నించగా.. మీ లాంటి మగాళ్లను బారాబర్ కొడతాం అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. బూతులు తిట్టారు. ట్రాఫిక్ లో ఉండగా స్కూటికి జస్ట్ టచ్ అయ్యిందని.. అంత మాత్రానికే క్యాబ్ ను ఓవర్ టేక్ చేసి, మరీ తనను పోలీస్ స్టేషన్ కి లాక్కొచ్చారని తెలిపాడు క్యాబ్ డ్రైవర్.

తప్పు తప్పేనని..ఎక్కువ మాట్లాడకు అంటూ తిట్లపురాణం ఎత్తుకున్నారు. అమ్మాయిల కోపానికి క్యాబ్ డ్రైవర్ కి ఏం చేయాలో తెలియలేదు. మీ ఇష్టం కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అంటూ సైలెంట్ అయ్యాడు. పక్కనే చాలామంది ఉన్న.. చూస్తుండి పోయారు. అమ్మాయిలు ఇచ్చిన కౌంటర్ దెబ్బకు క్యాబ్ డ్రైవర్ నోరు మూసుకుని వెళ్లాల్సి వచ్చింది.