ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులో కుక్కలు, ఎలుకల్లేవ్... ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు : స్పందించిన జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ 

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులో కుక్కలు, ఎలుకల్లేవ్... ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు : స్పందించిన జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘శంషాబాద్ ఎయిర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో కుక్కలు, ఎలుకలు’ వార్తపై జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు స్పందించారు. ఎయిర్​పోర్ట్ ప్రాంగణంలోకి కుక్కలు రాకుండా క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు ప్రాంగణంలో కుక్కలు, ఎలుకలు లేవన్నారు. 

2026 జనవరి నుంచి ఇప్పటివరకు 21 వీధి కుక్కలను తరలించినట్లు చెప్పారు. వ్యర్థాల నిర్వహణ విధానాలను మరింత కట్టుదిట్టం చేశామని, మూత ఉన్న డస్ట్​బిన్లలోనే వ్యర్థాలను పారవేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు నివారణ చర్యలను అమలు చేయనున్నట్లు చెప్పారు.