హైదరాబాద్, వెలుగు: గోద్రెజ్ ఆగ్రోవెట్ తన మూడో మహిళా వ్యవసాయ సదస్సులో సందర్భంగా దిశ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో మహిళా నిపుణుల సంఖ్యను పెంచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థినులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు.
సేల్స్, కమ్యూనికేషన్, వృత్తిపరమైన మెళుకువల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తారు. దిశ ద్వారా లక్ష మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వన్ ఎం వన్ బి, ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్‌తో కలిసి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఉద్యోగాలు సాధించారని కంపెనీ తెలిపింది.

