బంగారు వ్యాపారుల కొంప ముంచిన కేంద్రం.. కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్..

బంగారు వ్యాపారుల కొంప ముంచిన కేంద్రం.. కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్..

ఈవారం ప్రారంభంలో ప్రధాని మోడీ భారతీయులను ఏడాది పాటు గోల్డ్ కొనొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. దీంతో దేశంలోని జ్యూవెలరీ వ్యాపారుల్లో గుబులు స్టార్ట్ అయ్యింది. అరే తాము ఎలా బ్రతకాలంటూ చాలా మంది నిరసనలు కూడా చేసారు. కట్ చేస్తే ఆ తర్వాతే బంగారం దిగుమతులపై సుంకాలను పెంచే ఉద్దేశం లోదని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి భరోసా వచ్చింది. సర్లే గుడ్డిలో మెల్లలా ఇంత వరకూ సేఫ్  అనుకున్నారు బులియన్ వ్యాపారులు. కానీ మే 13న మోడీ సర్కార్ షాప్ ఇచ్చింది. గతంలో బంగారం, వెండి దిగుమతులపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి ఒక్కసారిగా 15 శాతానికి పెంచింది. ఇందులే 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండగా మిగిలిన 5 శాతం అగ్రికల్చర్ ఇన్ ఫ్రా సెస్ వేసింది.

మోడీ ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులను తగ్గించేందుకు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం చూస్తుంటే రానున్న ఏడాది పాటు బంగారం కొనటం సామాన్యులకు కల లాంటిదే అంటున్నారు నిపుణులు. ఈ వార్త బయటకు రావటంతో స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. బంగారం వ్యాపారానికి సంబంధించిన కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈ వారం ప్రారంభం నుంచి వరుసగా మూడో రోజు కూడా ఆ కంపెనీ షేర్లు పతనం కొనసాగింది. 

ఉదయం మార్కెట్ల ప్రారంభం నుంచే గోల్డ్ స్టాక్స్ కళతప్పాయి. ఏకంగా 4 శాతం వరకూ నష్టాలను మూటకట్టుకున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులు ఖరీదుగా మారనుండటంతో ఆ రంగంలో బిజినెస్ చేస్తున్న కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేసుకుంటున్నారు. దీంతో కళ్యాన్ జ్యువెలర్స్, టైటాన్, సెన్కో గోల్డ్, పీసీ జ్యువెలర్స్, పీఎన్ జ్యువెలర్స్ షేర్లు దాదాపు 5 శాతం వరకూ ఇంట్రాడేలో నష్టపోయాయి. 

స్పాట్ మార్కెట్ రియాక్షన్..
భారత ప్రభుత్వం బంగారం, వెండి ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం దేశీయ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రభావంతో బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్, వెండి ధరలు భారీగా పెరిగి 6 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.లక్షా 62 వేలకు చేరుకోగా, కిలో వెండి ధర రూ. 2లక్షల 95వేల వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే ఒరవడి కనిపిస్తోంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,713.39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర 1 శాతం పెరిగి 87.40 డాలర్లకు చేరుకుంది. జూన్ డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పెరిగి 4,721.80 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సుంకాల పెంపు ప్రకటన వచ్చిన వెనువెంటనే కమోడిటీ మార్కెట్లో ఈ స్థాయి ర్యాలీ రావడం గమనార్హం. తాజాగా పెరిగిన ధరలు సామాన్య కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపనున్నాయి.