పెరిగిన బంగారం వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు చూస్తే షాకే!

పెరిగిన బంగారం వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు చూస్తే షాకే!

భారత ప్రభుత్వం విదేశీల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండిపై సుంకాలను అమాంతం పెంచేయటంతో ఈ లోహాలు మధ్యతరగతి అందని దాక్షగా మారాయి. ఇప్పటికే పెరిగిన రేట్లలో కొనలేకపోతున్నాం అనుకుంటే దానికి అదనపు పన్నుల భారం తోడవటంతో ఇప్పట్లో గోల్డ్ షాపు గుమ్మం తొక్కే పరిస్థితి లేదంటున్నారు సామాన్యులు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారిన రేట్లను పరిశీలించటం అవసరం.

మే 14న బంగారం రేట్లు పెరిగాయి. మే 13 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.33 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 233గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 880గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 14, 2026న కేజీకి రూ.10వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 20వేల 100కు చేరుకుని షాక్ ఇచ్చింది. అంటే గ్రాము దాదాపుగా రూ.321 దగ్గర కొనసాగుతుందన్నమాట.