మోడీ కామెంట్స్ తర్వాత భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లివే

మోడీ కామెంట్స్ తర్వాత భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లివే

భారతీయులు ఏడాది పాటు బంగారం కొనటానికి దూరంగా ఉండాలంటూ ప్రధాని మోడీ కోరిన 48 గంటల్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరగటం స్టార్ట్ అయ్యాయి. బంగారం రేట్లు కొంత స్వల్పంగానే పెరిగినప్పటికీ వెండి మాత్రం ఒక్కరోజులోనే కేజీకి రూ.15వేలు పెరిగి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇదంతా చూస్తుంటే జనం గోల్డ్ కంటే వెండి కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారా? అందువల్లనే వెండి రేట్లు చాలా రోజులు స్థిరంగా ఉన్నాక తిరిగి ఇంతగా పెరిగాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి చాలా మందికి. మెుత్తానికి రేట్లు ఎలా ఉన్నా షాపింగ్ చేయాలి అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ముందుగా తమ నగరాల్లో పెరిగిన రిటైల్ ధరలను పరిశీలించటం మంచిది. 

మే 12న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మే 11 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.54 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 398గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 115గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 12, 2026న కేజీకి రూ.15వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.15వేలు పెరిగి రూ.3లక్షలు చేరుకుని షాక్ ఇచ్చింది. అంటే గ్రాము ధర రూ.300గా అమ్మకాలు జరుగుతున్నాయి.