వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సచిన్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సచిన్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

కోబె (జపాన్‌‌‌‌‌‌‌‌): ఇండియా పారా అథ్లెట్‌‌‌‌‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ సచిన్‌‌‌‌‌‌‌‌ సర్జేరావు ఖిలారి.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణం సాధించాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌–46 షాట్‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌లో సచిన్‌‌‌‌‌‌‌‌ ఇనుప గుండును 16.30 మీటర్ల దూరం విసిరి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. దీంతో తన పేరిటే ఉన్న ఆసియా రికార్డు (16.21 మీటర్లు)ను సవరించాడు. గతేడాది వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఈ రికార్డును నెలకొల్పాడు.

మెన్స్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ త్రో ఎఫ్‌‌‌‌‌‌‌‌–51లో ధరంభీర్‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. ఐదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో ధరంభీర్‌‌‌‌‌‌‌‌ 33.61 మీటర్ల దూరం విసిరి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇండియా ఖాతాలో 12 మెడల్స్‌‌‌‌‌‌‌‌ (5 గోల్డ్‌‌‌‌‌‌‌‌, 4 సిల్వర్‌‌‌‌‌‌‌‌, 3 బ్రాంజ్‌‌‌‌‌‌‌‌) ఉన్నాయి. 2023 ఎడిషన్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈసారి అదనంగా రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. ఈ టోర్నీలో గోల్డ్‌‌‌‌‌‌‌‌ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని సచిన్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు. పారిస్‌‌‌‌‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లోనూ సత్తా చాటుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు