హైదరాబాద్ ఫేమస్ ఫుడ్ డిష్‌లలో మరో కొత్త వంటకం యాడ్ అయింది. ఎంతో మంది ఫుడ్ ప్రియులను ఆకర్షిస్తున్న భాగ్యనగరంలో ఓ స్పెషల్ ఇడ్లీ ఆకట్టుకుంటోంది. ఇడ్లీ ఆకట్టుకోవడమా.. అనుకుంటున్నారా నిజమేనండీ. అందులో ప్రత్యేకతేంటనుకుంటున్నారా.. అది బంగారు పూత పూసిన ఇడ్లీ. బంజారాహిల్స్ లోని కృష్ణ ఇడ్లీ కేఫ్ కు వెళ్లండి. అక్కడ గోల్డ్ పూత పూసిన ఇడ్లీ రూ.1,200 కే దొరుకుతోంది.
ఇడ్లీ గార్నీషింగ్ లో గులాబీ రేకులు అతికిస్తారు. ఈ కేఫ్‌లో ఇడ్లీలే కాదు.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్‌జామూన్ లాంటి నోరూరించే స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి.
బిర్యానీ పేరును ఖండాంతరాలు వ్యాపింపజేసిన హైదరాబాద్ లిస్టులో కొత్తగా యాడ్ అయిన ఈ ఐటెమ్స్ ని తినడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
