V6 News

బంగారం ఈ ఏడాదే  రూ.1.85 లక్షలకు..!

బంగారం ఈ ఏడాదే  రూ.1.85 లక్షలకు..!
  • జియో పొలిటికల్ టెన్షన్లు, లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ధరలు పైకి
  • యాక్సిస్ డైరెక్ట్ అంచనా

న్యూఢిల్లీ:   ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని  యాక్సిస్ డైరెక్ట్ అభిప్రాయపడింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షల దగ్గర  ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి రూ.1.85 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది. అక్షయ తృతీయ సందర్భంగా  బంగారం కొనుగోలు  పెరుగుతాయని, డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని వివరించింది. కిందటేడాది అక్షయ తృతీయ నుంచి  బంగారం ధరలు 60 శాతం మేర పెరిగాయి.  యాక్సిస్ డైరెక్ట్ రిపోర్ట్ ప్రకారం,  ప్రస్తుత మాక్రో ఆర్థిక పరిస్థితుల్లో  పెట్టుబడులకు బంగారం మరింత  ఆకర్షణీయంగా మారింది. 

జియోపాలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్రిక్తతలతో పెరిగిన క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచి వృద్ధిని తగ్గిస్తాయి.  ఇది సాధారణంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుతుంది. దీంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగారం ధర ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి (28 గ్రాములకు) 5,300–5,500 డాలర్ల వరకు చేరొచ్చు.  దేశీయంగా 10 గ్రాముల బంగారం రూ.1.7–1.85 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.  ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ.  గోల్డ్‌‌‌‌‌‌‌‌ వరుసగా ఐదో ఏడాదిలోనూ డబుల్ డిజిట్ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వనుందని యాక్సిస్ డైరెక్ట అంచనా వేసింది. 

గత దశాబ్ద కాలంలో    ఏటా 18శాతం రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి నిఫ్టీ 50 కంటే మెరుగ్గా నిలిచిందని తెలిపింది. 2016లో బంగారంలో రూ.100 పెట్టుబడి పెడితే అది ఇప్పుడు  రూ.527గా మారేదని,  అదే సమయంలో నిఫ్టీ రూ.307 కి చేరేదని  వివరించింది. మరోవైపు   గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్ (ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల)లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి.  

2022లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్‌‌‌‌‌‌‌‌ రూ.1,500 కోట్లు అయితే, 2025లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.25 వేల నుంచి 30 వేల కోట్లకు పెరిగాయి. జియోపొలిటికల్ టెన్షన్లు పెరగడంతో వివిధ దేశాల సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు భారీగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తున్నాయి. 2022–24లో సంవత్సరానికి వెయ్యి టన్నులకుపైగా కొనుగోలు చేశాయి.  2026లో 850 టన్నుల వరకు కొనుగోలు చేస్తాయని అంచనా.