హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెయిలర్ బి. రవి కుమార్.. 6వ వైఏఐ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగెట్టాలో గోల్డ్ మెడల్ సాధించాడు. శనివారం ముగిసిన ఆప్టిమిస్ట్ మెయిన్ బాయ్స్ విభాగంలో రవి టాప్‌లో నిలిచాడు. ఖైరుల్ ఇల్జానీ మోద్ ఫెండి, సమన్యుకు వరుసగా సిల్వర్, బ్రాంజ్ లభించింది.
బాలికల విభాగంలో శృంగారి రాయ్, రమీజా భాను, సృష్టి సింగ్ టాప్–3లో నిలిచి పతకాలను సొంతం చేసుకున్నారు. ఆప్టిమిస్ట్ గ్రీన్‌లో యువరాజ్ సిరోహి, ఆదిత్య, సమర్త్‌కు బంగారు, రజత, కాంస్య పతకాలు దక్కాయి. గ్రీన్ గర్ల్స్‌లో సింధు, అన్య రెడ్డి, రోష్ని కశ్యప్ విజేతలుగా నిలిచారు.
ఐఎల్‌సీఏ–4 బాయ్స్‌లో సింగ్ సిసోదియా, రాహుల్ సోనార్, ప్రీత్ సివాల్, ఐఎల్‌సీఏ–4 గర్ల్స్‌లో తులసి పాట్లే, కృత్తిక విశ్వనాథన్, ప్రగ్యా దాస్, ఐఎల్‌సీఏ–6 బాయ్స్‌లో హ్రిథిక్ అమర్ జైస్వాల్, ఎర్ర హర్షవర్ధన్, కేతావత్ నితిన్, ఐఎల్‌సీఏ–6 గర్ల్స్‌లో శీతల్ సెందవ్, తులసి పాట్లే, మాన్యా రెడ్డి విజయాలు సాధించారు.
