బులియన్ మార్కెట్లలో బేజారు కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో శాంతి ఒప్పందం కుదరకపోవటంతో ఆ అలజడి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను వెంటాడుతూనే ఉంది. దీంతో బంగారం, వెండి డిమాండ్ వెలవెలబోతోందని వ్యాపారులు అంటున్నారు. ఈ క్రమంలో వరుసగా కొనసాగుతున్న రేట్ల పతనాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొనుగోలుదారులు ముందుగా తమ ప్రాంతంలోని రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం.
మే 9న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మే 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.33 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 235గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 965గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 9, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 80వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.280గా అమ్మకాలు జరుగుతున్నాయి.
