రంజాన్ రోజున తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే..

రంజాన్ రోజున తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే..

అమెరికా డాలర్ విలువ పెరగడం,  ముడిచమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగిపోవడంతో మళ్లీ ధరలు పెరుగుతాయన్న ఆందోళన మొదలైంది. దింతో గత వారం ప్రపంచ మార్కెట్‌లో బంగారం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా బంగారం ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన సమయంలో MCX మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,60,000 వరకు వెళ్లింది. గత వారం భారీగా పడిపోయిన బంగారం ధర, చివరకు 10 గ్రాములకు రూ.1,44,825 వద్ద నిలిచింది. బంగారం ధరలు తగ్గడం వల్ల కొనుగోలుదారులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.

ఈ రోజు (మార్చ్ 21) 24క్యారెట్ల బంగారం  1గ్రాము ధర కాస్త తగ్గి రూ.14,890 ఉండగా,  22క్యారెట్ల బంగారం  ధర రూ.13,654, 18క్యారెట్ల  బంగారం ధర రూ.11,172. దింతో 10 గ్రాముల 24క్యారెట్ల ధర రూ.10 తగ్గి రూ.1,48,900,  22క్యారెట్ల ధర  రూ.1,36,540, 18క్యారెట్ల ధర రూ.1,11,720. 

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల  24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,900, 22క్యారెట్ల ధర రూ.1,36,540, 18క్యారెట్ల ధర రూ.1,11,720

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో  10 గ్రాముల  24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,900, 22క్యారెట్ల ధర రూ.1,36,540, 18 క్యారెట్ల  ధర రూ.1,11,720

ఇక వెండి గ్రాము ధర రూ.254.90 ఉండగా.. కిలోకి రూ.100 తగ్గి రూ.2,54,900 చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర చూస్తే రూ.2,59,900 వద్ద ఉంది. 

బంగారం, చమురు ధరలపై  ప్రభావం
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న దాడుల  ప్రభావం రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఇరాన్‌లోని 'సౌత్ పార్స్' గ్యాస్ నిలయాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ప్రతికారంగా ఇరాన్ కూడా ఇతర గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి.

ఈ గొడవల వల్ల పెట్రోల్, డీజిల్ (ముడిచమురు) సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో వాటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనివల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి, సామాన్యుడిపై భారం పడే ప్రమాదం ఉంది.