నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రేపు 3 వేల 93 పోస్టులకు నోటిఫికేషన్లు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రేపు 3 వేల 93 పోస్టులకు నోటిఫికేషన్లు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC). తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా.. జూన్ 02న 3 వేల 93 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. 

ముఖ్యంగా అటవీ శాఖలోఖాళీగా ఉన్న 3,093 పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రిక్రూట్‌మెంట్‌ పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావులేకుండా ఉండేందుకు కంప్యూటర్ (ఆన్‌లైన్) విధానంలోనే నిర్వహిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో కొత్త నియామకాలకు సంబంధించి  ఆర్థిక శాఖ ఇప్పటికే  అనుమతులు మంజూరు చేసిందని కమిషన్ చైర్మన్ వివరించారు.  త్వరలోనే వరుసగా మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. జూన్ నెలలో వీలైనంత ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల 3 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.