యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీమియం సేవలు ప్రారంభం

యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీమియం సేవలు ప్రారంభం

సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ తన యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీమియం సేవలను ఇవాళ(బుధవారం) ప్రారంభిచింది. గతేడాది మేలోనే ఈ సేవలపై ప్రకటన రావాల్సి ఉండగా ఇప్పుడు ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు భారత్‌లోని యూజర్లు తమకు ఇష్టమైన మ్యూజిక్ ను యూట్యూబ్‌ మ్యాజిక్‌ ద్వారా వినవచ్చు. అయితే యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఫ్రీ,  ప్రీమియం ఆప్షన్లలో వినియోగదారులకు లభిస్తోంది. ఫ్రీ సర్వీస్‌లో అయితే యాప్‌లో యాడ్స్‌ వస్తాయి. కానీ ప్రీమియం సర్వీస్‌లో యాడ్స్‌ రావు. అందుకు గాను యూజర్లు కొంత మనీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే లాంచింగ్‌ సందర్బంగా 3నెలల పాటు యూట్యూబ్‌ ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. ఒకవేళ మీరు సాంసంగ్ గెలాక్సీ ఎస్10 కొంటే యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం లేదా గూగుల్ ప్లే మ్యూజిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు నాలుగు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం వాడుకోవచ్చు.

ఆ  తర్వాత నెలకు రూ.99 చెల్లించాలి. లేదా రూ. 149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్‌ తీసుకుంటే 5 మంది కుటుంబ సభ్యులు యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీమియం సేవలను పొందవచ్చు. ఆ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ ఫాంలపై యూజర్లకు లభిస్తున్నది.