గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో పబ్లిక్‌ టాయ్‌ లెట్స్‌ ఇన్ఫో

గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో పబ్లిక్‌ టాయ్‌ లెట్స్‌ ఇన్ఫో

దేశంలోని మరో 57 వేల పబ్లిక్‌‌ టాయ్‌‌లెట్స్‌‌ సమాచారాన్ని యాడ్‌‌ చేస్తున్నట్లు గూగుల్‌‌ మ్యాప్స్‌‌ ప్రకటించింది. హౌజింగ్‌‌ అండ్‌‌ అర్బన్‌‌ ఎఫైర్స్‌‌ మినిస్ట్రీతో కలిసి పని చేస్తున్న గూగుల్‌‌ దేశంలోని 2,300 నగరాలకు చెందిన పబ్లిక్‌‌ టాయిలెట్స్ సమాచారాన్ని యాడ్‌‌ చేసింది. స్వచ్ఛభారత్‌‌ కార్యక్రమంలో భాగంగా 2016లో గూగుల్‌‌ మ్యాప్స్‌‌ న్యూఢిల్లీ, భోపాల్‌‌, ఇండోర్‌‌‌‌ నగరాల్లో వీటిని యాడ్‌‌ చేసింది. అప్పట్నుంచి అనేక నగరాల్లోని పబ్లిక్‌‌ టాయిలెట్స్  సమాచారాన్ని యాడ్‌‌ చేస్తూనే ఉంది. యూజర్లు గూగుల్‌‌ సెర్చ్‌‌ లేదా గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో ‘పబ్లిక్‌‌ టాయిలెట్స్ నియర్‌‌‌‌ మి’ అని టైప్‌‌ చేస్తే చాలు. దగ్గర్లో ఉన్న వాటి సమాచారం కనిపిస్తుంది. యూజర్లు వాటికి రేటింగ్‌‌, రివ్యూస్‌‌ కూడా ఇవ్వొచ్చు. దీనివల్ల యూజర్లు మంచి వాటిని ఎన్నుకునే చాన్స్‌‌ ఉంది. అలాగే ప్రభుత్వానికి కూడా వాటిని డెవలప్‌‌ చేసేందుకు అవకాశం దొరుకుతుంది.