‘వాష్ కాంక్లేవ్’ లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై..

‘వాష్ కాంక్లేవ్’ లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై..

హైదరాబాద్: రాజేంద్రనగర్ లో జరుగుతున్న వాష్ కాంక్లేవ్ లో పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై. సభలో మాట్లాడిన ఆమె… ప్రపంచంలో ఎంతో మంది చిన్నారులు మంచినీరు అందక మరణిస్తున్నారని అన్నారు. స్వచ్చమైన నీరు, పారిశుద్ధ్యం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతాయని చెప్పారు. ప్రధాని మోడీ చేపట్టిన స్వచ్ భారత్ దేశానికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు కలెక్టర్లు పారిశుద్ధ్యంపై చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని మెచ్చుకున్నారు.  రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్ లో  పిల్లలు చేతులు కడగడంలేదని తన దృష్టికి వచ్చిందని.. అప్పుడే చిన్నారులు చేతులు కడిగేందుకు చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు.

డయేరియా, కలరా, జిఈ తో ఎంతోమంది చిన్నారులు మృత్యు వాత పడుతున్నారని చెప్పారు తమిళిసై. చిన్నారులు, మహిళల విషయంలో పారిశుధ్యం మరింత అవసరమని చెప్పారు. మనమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత ఉదృతం గా చేపడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. మురుగు నీటిని శుద్ధి చేసి వినియోగం లోకి తెస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందివ్వ వచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కోసం సాంకేతికను ప్రజలు వాడుకోవాలని చివరి మనిషి వరకు పారిశుధ్యం పరద్రోలే వరకు చైతన్యం తేవాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషణ్ భగీరత శుద్ధ మైన మంచినీటిని అందిస్తోందని తెలిపారు.