పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS పార్టీ VRS తీసుకుంటుంది : మంత్రి ఉత్తమ్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS పార్టీ VRS తీసుకుంటుంది : మంత్రి ఉత్తమ్

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ వ్యవస్థను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలని సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. .బిల్లుల మీద కనీసం చర్చ కూడా చేయరని విమర్శించారు. మరొక సారి మోడీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా,నార్త్ కొరియా లాగా దేశం తయారు అవుతుందని చెప్పారు.

 ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ కేస్ లు  ప్రతిపక్ష పార్టీల నేతల మీద పెడతారని మరొక సారి బీజేపీ వస్తే పార్లమెంటరీ డేమక్రసి ఉండదని తెలిపారు.  డీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదని తెలిపారు. దేశాన్ని ఎలా విభజించాలనీ బీజేపీ ఆలోచన చేస్తుందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. 

పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదని బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుంది.కాళేశ్వరం విషయం లో జరిగిన తప్పులకు కెసీఆర్ జనాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  బీజేపీ వాళ్ళు ఇప్పటికే చాలా ప్రభుత్వాలు కూల్చారు..కానీ తెలంగాణ లో బీజేపీ వాళ్ళ  ఆటలు ఇక్కడ సాగవని అన్నారు. క్రికెట్  టీమ్ లాగా మేము పటిష్ఠం గా ఉన్నామని ఇండియా కూటమి గెలుస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.