మోదీ గ్యారంటీ అంటే..అభివృద్ది, భధ్రతకు గ్యారంటీ: ప్రధాని మోదీ

మోదీ గ్యారంటీ అంటే..అభివృద్ది, భధ్రతకు గ్యారంటీ: ప్రధాని మోదీ

మహబూబ్ నగర్: మోదీ గ్యాంరటీ అంటే అభివృద్ది, భద్రతకు గ్యారంటీ అన్నారు ప్రధాని మోదీ. నా గ్యారంటీలు అన్నీ గ్యారంటీగా అమలవుతాయన్నారు. మోదీ గ్యారంటీ అంటే అన్ని వర్గాల అభివృద్దికి గ్యారంటీ అన్నారు ప్రధాని మోదీ. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు.  గడిచిన పదేళల్లో తెలంగాణకు ఇచ్చిన లక్షల కోట్లు బీఆర్ఎస్ జేబులు నింపుకుందని ప్రధాని మోదీ అన్నారు.  బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా తెలంగాణను లూటీ చేస్తుందన్నారు. 

కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు ప్రధాని మోదీ.  పరిశ్రమలకు సంబందించి కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీని ఓపెన్ చేసిందన్నారు. వచ్చే రాగానే అది బీఆర్ ఎస్ జీరాక్స్ కాపీగా మారిపోయిందన్నారు. బీఆర్ ఎస్ పదేళ్లలో ఎంత లూటీ చేసిందో.. కాంగ్రెస్ కొన్ని నెలల్లో అంత లూటీ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఫేక్ వీడియోల ఫ్యాక్టరీని ఓపెన్ చేసిందన్నారు. కాళేశ్వరం పై విచారణకు కాంగ్రెస్ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక RR ట్యాక్స్ మొదలైందన్నారు. ఈ RR ట్యాక్స్ గురించి దేశమంతా చర్చిస్తోందన్నారు. 

మహబూబ్ నగర్ ప్రజలను బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని మోదీ విమర్శించారు. తెలంగాణ వచ్చినంక  కేసీఆర్ ను నమ్మి గెలిపిస్తే మహబూబ్ నగర్ ప్రజలను మర్చిపోయారన్నారు .. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంతం నుంచి గెలిచారు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందన్నారు. మహబూబ్ నగర్ ప్రాంతంలో కృష్ణ, తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా.. రైతులకు చుక్క నీరందడం లేదన్నారు. ఈ తీరు మారాలంటే బీజేపీ ప్రతినిధి ఉండాలని అన్నారు ప్రధాని మోదీ.