Mr.Idiot: మిస్టర్ ఇడియట్గా రవితేజ వారసుడు.. టీజర్ మాత్రం అదిరిపోయింది!

Mr.Idiot: మిస్టర్ ఇడియట్గా రవితేజ వారసుడు.. టీజర్ మాత్రం అదిరిపోయింది!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ అయినా హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు చిరంజీవి ఆతరువాత వచ్చే పేరు రవితేజ, అవును.. కేవలం తన కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. ఆతరువాత తన ఇద్దరు తమ్ముళ్లు కూడా నటులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ, వాళ్లు పెద్దగా సక్సెస్ అవలేదు. ఇప్పుడు రవితేజ కాంపౌండ్ నుండి మరో  కుర్ర హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. 

మిస్టర్.ఇడియట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. ఇక తన మొదటి సినిమాకు పెదనాన్న రవితేజ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఆయన సూపర్ హిట్ సినిమా టైటిల్ ఇడియట్ ను తన మొదటి సినిమాకు పెట్టుకున్నాడు మాధవ్. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తున్నా ఈ సినిమాను.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేశారు మేకర్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ లో హీరో మాధవ్ యాక్టింగ్ చూస్తుంటే రవితేజ ఇడియట్ గుర్తుకు వస్తోంది.  

రవితేజ బాడీ లాంగ్వేజ్, ఆయన వాకింగ్ స్టైల్ ను మాధవ్ రీక్రియేట్ చేయడం హైలైట్ గా నిలిచింది. దాంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.