ఆర్టీసీ యూనియన్ నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

ఆర్టీసీ యూనియన్ నేతలతో  గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

ఆర్టీసీ యూనియన్ నేతలకు రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది. ర్యాలీని నడిపిస్తున్న యూనియన్ లీడర్లు రాజ్ భవన్ లోకి రావాలని  సిబ్బంది సూచించారు. యూనియన్ నేతలతో గవర్నర్ తమిళి సై పుదుచ్ఛేరి నుంచి(ఆగస్టు5) 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తారని చెప్పారు.  ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో  సామాన్య కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ  మరో వైపు వేలాది మంది ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయల్దేరారు. దీంతో రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ లోకి రాకుండా  సోమాజిగూడ, ఖైరతాబాద్ సర్కిల్స్ ను బ్లాక్ చేశారు.