రిలయన్స్​కు వ్యతిరేకంగా కేసు.. ఓడిపోయిన కేంద్ర ప్రభుత్వం

రిలయన్స్​కు వ్యతిరేకంగా కేసు.. ఓడిపోయిన కేంద్ర ప్రభుత్వం

రిలయన్స్​కు వ్యతిరేకంగా కేసు.. లండన్‌​ కోర్టులో ఓడిపోయిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: వెస్టర్న్​ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌షోర్ పన్నా–-ముక్తా,  తపతి ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్‌‌‌‌లలో కాస్ట్ రికవరీ కేసులో కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  షెల్‌‌‌‌లకు అనుకూలంగానే తీర్పు వచ్చింది.  ఈ కంపెనీలకు  111 మిలియన్​ డాలర్ల అర్బిట్రేషన్​అవార్డు ఇవ్వాల్సిందేనని  యూకే హైకోర్టు స్పష్టం చేసింది.  హైకోర్టు న్యాయమూర్తి రాస్ క్రాన్‌‌‌‌స్టన్ ఈ ఏడాది జూన్ 9న  ఈ మేరకు తీర్పు చెప్పారు. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవసరమైన పరిమితుల ప్రకారం లేదనే విషయాన్ని ప్రభుత్వం తగిన సమయంలో తమ దృష్టికి తీసుకురాలేదని అన్నారు. ఈ కేసులో ప్రభుత్వ వాదనలు సరిగ్గా లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాయల్టీ ప్రొవిజన్లు, చెల్లించాల్సిన లాభం, రాయల్టీపై వివాదం ఏర్పడటంతో  రిలయన్స్  షెల్ యాజమాన్యంలోని బీజీ ఎక్స్‌‌‌‌ప్లోరేషన్ & ప్రొడక్షన్ ఇండియా (బీజీఈపీఐఎల్​) 2010 డిసెంబర్ 16న కేసు వేసింది. ప్రభుత్వంతో లాభాలను పంచుకునే ముందు చమురు  గ్యాస్ అమ్మకాలు నుండి రికవరీ చేయగల ఖర్చు పరిమితిని పెంచాలని కోరింది.  వ్యయం, పెరిగిన అమ్మకాలు, అదనపు ఖర్చుల రికవరీ  షార్ట్ అకౌంటింగ్‌‌‌‌పై కేంద్రం అభ్యంతరాలను లేవనెత్తింది. సింగపూర్‌‌‌‌కు చెందిన న్యాయవాది క్రిస్టోఫర్ లా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ప్యానెల్ అక్టోబర్ 12, 2016న ఫైనల్​ పార్షియల్​ అవార్డును (ఎఫ్​పీఏ)ను జారీ చేసింది. ఇది క్షేత్రాల నుండి వచ్చే లాభాన్ని ప్రస్తుత పన్నును తీసివేసి లెక్కించాలనే ప్రభుత్వ అభిప్రాయాన్ని సమర్థించింది.       బీజీఈపీఐఎల్  నుండి 3.85 బిలియన్ల డాలర్ల బకాయిలను పొందడానికి ప్రభుత్వం ఈ అవార్డును ఉపయోగించుకుంది. రెండు సంస్థలు 2016 ఎఫ్​పీఏని ఇంగ్లీష్ హైకోర్టులో సవాలు చేశాయి.