స్కూల్స్ రీ ఓపెన్.. పలు చోట్ల హాజరుకాని విద్యార్థులు..

స్కూల్స్ రీ ఓపెన్.. పలు చోట్ల హాజరుకాని విద్యార్థులు..

రాష్ట్రంలో ఈరోజు నుండి స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలకు పలు చోట్ల అనుకున్నంత ఆదరణ లభించడం లేదు. చాలా మంది విద్యార్థులు మొదటి రోజు పాఠశాలలకు హాజరుకాలేదు. మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించలేదు. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు హజరు కాలేదు. స్కూల్ కి మొదటి రోజు కావడంతో పాటు.. వర్షం కూడా పడటంతో విద్యార్థులు స్కూల్ కు వెళ్లేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో తరగతి గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్ తో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంది. వచ్చిన వారు కూడా యూనిఫామ్స్, కొత్త పుస్తకాలు లేకుండానే వచ్చారని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు.

మన ఊరు మన బడి కింద ఎంపిక చేసుకున్న పాఠశాలలో డెవలప్ మెంట్ లేదని స్థానికులు అంటున్నారు.మరోవైపు ఖమ్మం జిల్లా పాఠశాలలో విద్యార్థుల భారీగా వచ్చినా.. సూడెంట్స్ కు తగినంత టీచర్లు లేరు. పిల్లలకు తగినంత టీచర్ల సంఖ్య లేరని పేరెంట్స్ వాపోతున్నారు. టీచర్ల కొరత ఉండడంతో ఇంగ్లీష్ మీడియం,తెలుగు మీడియం విద్యార్థులను కలిపి కూర్చోబెట్టారు స్కూల్ సిబ్బంది. మరోచోట నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్ష జరుగుతుండగా.. ఈ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరుకావడం సిబ్బంది షాక్ తిన్నారు. అయితే ఈ ఒక్క విద్యార్థి కోసం  8 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో దాదాపు 41 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. 59 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ బడిబాటపట్టారు.ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం షురూ కానుంది. బడి బాటలో భాగంగా 70 వేల 698 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ సారి సర్కారి బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని.. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడికక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు బడికి వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలకాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని 7,289 కోట్ల రూపాయలతో దశలవారీగా చేపడుతున్నామని, మొదటిదశలో 9,123 స్కూళ్లలో 3,497 కోట్లతో 12 రకాల మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సబితారెడ్డి చెప్పారు. అయితే బాడి బాటతో ప్రజా ప్రతినిధులు బాడికి వెళ్లి పిల్లలకు స్వాగతం చెబుదామనుకుంటే.. పిల్లలు మాత్రం అకునుకున్నంత సంఖ్య బాడి బాట పట్టాలేదని చెప్పాలి.