SBI గుడ్ న్యూస్..ఉద్యోగాల్లో 85 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులకే

SBI గుడ్ న్యూస్..ఉద్యోగాల్లో 85 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులకే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. SBI త్వరలో చేపట్టనున్న 12 వేల ఉద్యోగాల నియామకాల్లో దాదాపు 85 శాతం ఉద్యోగాలు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వనున్నట్లు తెలిపింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నియామకాలు చేపట్టనుంది. 

దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన SBI ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 లో 12 వేలమంది ఫ్రెషర్లను ప్రొబేషనరీ ఆఫీసర్లుగా, అసోసియేట్లుగా నియమించనుంది.  అయితే వీటిలో 85 శాతం ఉద్యోగులు ఇంజనీరింగ్ గ్రాడ్యెయేట్లకు ఇవ్వాలని నిర్ణయించిన బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉన్న 3 వేల మందిని పీవోలుగా, 8వేల మందికి పైగా అసోసియేట్లను శిక్షణ ఇచ్చి వివిధ విభాగాల్లో నియమించనున్నారు. 

ఇటీవల కాలంలో ఐటీ రంగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు తగ్గిపోయిన విషయం తెలిసిందే.. ఐటీ సెక్టార్ లో తగ్గుతున్న సమయంలో  SBI  నిర్ణయం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కొంత ఊరట కలిగిస్తుంది.