బైకు పెట్రోల్ ట్యాంకు పేలి పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తుండగా ఓ బైక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే వాహనదారుడు మంటలను ఆపేందుకు బైక్‌ను పక్కకు ఆపి నీళ్లు చల్లాడు. అతనికి స్థానికులు మరికొంతమంది సాయం చేశారు. కాలిపోతున్న బుల్లెట్ పై నీళ్ళు పోసి అర్పే సమయంలో ఒక్కసారిగా బైకు పెట్రోల్ ట్యాంకు పేలింది. దీంతో 10 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్ పరిధి మొఘల్‌పురా వద్ద జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడు వివరాలపై అరా తీస్తున్నారు.
