- హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన వేడుకల ఏర్పాట్లను ఎస్పీ శరత్‌చంద్రపవార్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. తాగునీరు, టెంట్లు, కుర్చీలు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంటన అడిషనల్ కలెక్టర్లు జె.శ్రీనివాస్, ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయక కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్పీ రమేశ్, డీఆర్‌డీవో దశరథ్, ఆర్డీవో వై.అశోక్‌రెడ్డి, తదితర అధికారులు ఉన్నారు.
