హైదరాబాద్ లో గ్రీన్ సిమెంటెక్ సదస్సు  

హైదరాబాద్ లో గ్రీన్ సిమెంటెక్ సదస్సు  

హైదరాబాద్​, వెలుగు:  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లో  22వ గ్రీన్ సిమెంటెక్ సదస్సు ప్రారంభమైంది.  నెట్ జీరో కార్బన్ దిశగా సిమెంట్ పరిశ్రమ అడుగులు వేయడంపై చర్చలు జరిగాయి. అల్ట్రాటెక్ సిమెంట్ వ్యాపార విభాగం చైర్మన్ రాజ్ నారాయణన్ మాట్లాడుతూ వికసిత్ భారత్ నిర్మాణంలో ఈ రంగం పాత్రను వివరించారు. 

గ్రీన్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కోసం తక్కువ కార్బన్ విడుదల చేసే పదార్థాలను వాడాలని ఐజీబీసీ చైర్మన్ శేఖర్ రెడ్డి సూచించారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు, వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని నిపుణులు కోరారు. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీకి సంబంధించిన ఒక నివేదికను సదస్సులో విడుదల చేశారు. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ పరికరాలను ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శించారు.