తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. నియామకాల ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే TSPSC కీలక ప్రకటన చేసింది. టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి కసరత్తు పూర్తి చేసింది.

