ప్రపంచంలో ఎత్తైన వ్యక్తి ఫొటోను రీట్వీట్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ప్రపంచంలో ఎత్తైన వ్యక్తి ఫొటోను రీట్వీట్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ప్రపంచంలో ఎత్తైన వ్యక్తికి సంబంధించిన ఫొటోను హిస్టరీ ఇన్ కలర్ తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోస్ట్ చేసింది. 1935 నుండి "ది జెయింట్ ఆఫ్ ఇల్లినాయిస్" అని పిలువబడే రాబర్ట్ వాడ్లో చిత్రాన్ని పంచుకున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్... ఇప్పటివరకు జీవించిన అత్యంత ఎత్తైన వ్యక్తి యొక్క అద్భుతమైన చిత్రమనే క్యాప్షన్ ను జత చేసింది. Mr వాడ్లో 1955 నుండి రికార్డులను ఈ కలిగి ఉన్నాడు. చివరిగా 27 జూన్ 1940న కొలిచినప్పుడు అతను 8 అడుగుల 11.1 ఇంచుల(2.72 m) ఎత్తుగా ఉన్నాడు. ఐదు సంవత్సరాల వయస్సులో Mr వాడ్లో 1.63 m (5 ft 4 ఇంచులు) ఉండేవాడని తెలుస్తోంది. అయితే అతని దుస్తులను ఉద్దేశించి మాట్లాడాల్సి వస్తే తన ఎనిమిదేళ్ల వయసులో 5 అడుగుల 11 ఇంచు పొడవైన, అంటే తన తండ్రి కంటే పొడవైన దుస్తులను ధరించేవాడని సమాచారం.

ఇదే విషయాన్ని మళ్లీ గుర్తుకు తెస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం, మిస్టర్ వాడ్లో తన పిట్యూటరీ గ్రంధి యొక్క హైపర్‌ప్లాసియాకు కారణమైన ఒక అరుదైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందట. అయితే ఇది మానవ పెరుగుదల హార్మోన్ ను అసాధారణ స్థాయికి దారితీసిందని తెలిపింది. రాబర్ట్ ఎత్తు అనేక వైద్య సమస్యలకు కారణమైందని, అతను పెద్దయ్యాక -పొడవుగా పెరిగేకొద్దీ ఇది మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన అందరితో సమానంగా, అందరి పిల్లలలాగే ఉండడానికి చాలా ప్రయత్నించాడని వెల్లడించింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా తాను కేవలం 6 అడుగుల ఎత్తున్న వారితో మాత్రమే డేటింగ్ చేస్తానని ఓ యూజర్ హాస్యాస్పద కామెంట్ చేశారు.

Mr. వాడ్లో కేవలం 22 ఏళ్ళ వయసులో మరణించాడు. అతను 15 జూలై 1940న మిచిగాన్‌లోని మానిస్టీలోని ఒక హోటల్‌లో తుదిశ్వాస విడిచాడు. అతని కుడి చీలమండపై సెప్టిక్ అయ్యి పొక్కు రావడంతో దానికి చికిత్స చేసిన వారం లోపే, నిద్రలో ఉండగానే ఆయన మృతి చెందినట్టు సమాచారం.