ప్రేగ్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌: గుకేశ్‌‌‌‌‌‌‌‌ విజయం

ప్రేగ్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌: గుకేశ్‌‌‌‌‌‌‌‌ విజయం

ప్రేగ్‌‌‌‌‌‌‌‌: వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌.. ప్రేగ్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో గుకేశ్‌‌‌‌‌‌‌‌ 56 ఎత్తుల వద్ద డేవిడ్ అంటోన్‌‌‌‌‌‌‌‌ గుయిజారో (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. 

వరుస డ్రాలు, మూడు పరాజయాల తర్వాత గుకేశ్ తన సత్తాను చూపెట్టాడు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి గుయిజారోకు ఈజీగా చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. డేవిడ్‌‌‌‌‌‌‌‌ నవారో (చెక్‌‌‌‌‌‌‌‌, 4.5)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌లో అరవింద్‌‌‌‌‌‌‌‌ చిదంబరం 64 ఎత్తుల వద్ద విజయం సాధించాడు.

దాంతో అరవింద్‌‌‌‌‌‌‌‌ ఐదు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలవగా, గుకేశ్‌‌‌‌‌‌‌‌ మూడున్నర పాయింట్లతో టోర్నీని ముగించాడు. నొడిర్బెక్‌‌‌‌‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌) ఆరు పాయింట్లతో టైటిల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌లో దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌.. హర్బెక్‌‌‌‌‌‌‌‌ స్టీపాన్‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి ఐదు పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. సూర్యశేఖర గంగూలీ (4).. బెంజామిన్‌‌‌‌‌‌‌‌ గ్లెడురా (హంగేరి, 4.5)పై విజయంతో టోర్నీని ముగించింది.