
జాగ్రెబ్: ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. గ్రాండ్ చెస్ టూర్‌లో రెండు విజయాలతో మెరి శాడు. సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్‌లో భాగంగా శుక్రవారం రిచర్డ్ రాపోర్ట్‌తో జరిగిన తొలి గేమ్‌ను గుకేశ్ డ్రా చేసుకున్నాడు. కానీ తర్వాత జరిగిన రెండు గేమ్‌ల్లో వరుసగా కాన్‌స్టాంటిన్ లుప్‌లెస్క్, ఇవాన్ సారిక్‌లను ఓడించాడు. ఫలితంగా ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి గేమ్‌లో ఇవాన్ సారిక్‌ను ఓడించిన విషీ.. ఫ్యాబియానో కరువానాతో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకు న్నాడు. కానీ ఆఖరి గేమ్‌లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్కార్ల్సన్ చేతిలో ఓడాడు. ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న ఆనంద్.. ఇయాన్ నెపో మినాట్చి, ఫాబియానో కరువానాతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.