540 ఎకరాలు ఉదాసీన్ మఠానికి అప్పగింత

540 ఎకరాలు ఉదాసీన్ మఠానికి అప్పగింత

హైదరాబాద్ కూకట్ పల్లి IDL సంస్థ ఆధీనంలో ఉన్న మఠం భూములను..ఉదాసీన్ మఠానికి తెలంగాణ ప్రభుత్వం అప్పజెప్పింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం మఠానికి చెందిన 540 ఎకరాల 30 గుంటల భూమిని అప్పగించింది. ఉదాసీన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కేసులో.. భూములపై పూర్తి హక్కు మఠానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 



కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర మఠానికి ఉన్న 540 ఎకరాల భూమిని 1964 నుంచి 1978 వరకు నాలుగు దఫాలుగా ఐడీఎల్ కెమికల్స్ కు లీజుకిచ్చింది. భూములన్నీ బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ..ఐడీఎల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించింది. దీంతో గల్ఫ్ ఆయిల్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2011  నుంచి  ఉదాసీన్ మఠం న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు భూములపై సర్వహక్కులు మఠానికే చెందుతాయని తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూములను మఠానికి అప్పగించింది.