వర్సిటీ చరిత్రలోనే తొలిసారి: ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్​గా గుమ్మడి అనురాధ 

వర్సిటీ చరిత్రలోనే తొలిసారి: ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్​గా గుమ్మడి అనురాధ 
  • వర్సిటీ చరిత్రలోనే తొలిసారి ఆదివాసీ మహిళ నియామకం 

ఓయూ,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్​ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్​బాగ్​లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్​గా ఆమెను నియమిస్తూ  వీసీ ప్రొ. రవీందర్ ​బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ చరిత్రలోనే ఆదివాసీ మహిళా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్​గా బాధ్యతలు చేపట్టడం తొలిసారి. యూనివర్సిటీలోనే పీజీ,  లా కోర్సులు చదివిన ఆమె ఓయూ లా విభాగంలో అసిస్టెంట్​ప్రొఫెసర్​గా జాయిన్​అయ్యారు. ఆదివాసీ కమ్యూనిటీలోని కోయ తెగకు చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురైన అనురాధ ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామమైన టేకులగూడెంలో జన్మించారు.