KKR vs PBKS : నేడు కోల్కతాతో పంజాబ్ మ్యాచ్.. ధావన్ దూరం!

KKR vs PBKS : నేడు కోల్కతాతో పంజాబ్ మ్యాచ్.. ధావన్ దూరం!

ఇవాళ(ఏప్రిల్ 26న) కోల్కతాతో పంజాబ్ కింగ్స్ రాత్రి 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఇరు జట్లు ఫ్లే ఆప్ లైన్ క్లియర్ చేసుకొవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే పాయింట్ల పట్టికలో కోల్కత్తా సెకండ్ ఫ్లేస్ లో ఉండగా, పంజాబ్ కింగ్స్ మాత్రం చివర నుంచి సెకండ్ ఫ్లేస్ లో ఉంది. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 సార్లు తలపడ్డాయి. కానీ, ఇందులో  కేకేఆర్ ఆధిపత్యం ప్రదర్శించింది. 21 సార్లు కేకేఆర్ విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ 11 సార్లు విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల బలాబలాలు ఒకసారి చూసుకుంటే...

కోల్కత్తా నైట్ రైడర్స్..

కేకేఆర్ టీమ్ టోర్నీ ఆరంభం నుంచి దుకూడుగానే ఆడుతుంది. కోల్కత్తా టీమ్ లో ఫిలిఫ్ సాల్ట్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రి రస్సెల్, మనీష్ పాండే, నితీష్ రానా, రింకు సింగ్ మొదలగు హిట్టర్లతో టీమ్ పటిష్టంగా కనిపిస్తుంది. కేకేఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపినింగ్ ఫేయిర్ ధారాళంగా పరుగులు చేస్తుంది.  సునీల్ నరైన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇక నరైన్ రాజాస్థాన్ తో మ్యాచ్ లో సెంచరీ సునాయాసంగా చేశాడు. సునీల్ తో పాటు మిగితా ఆటగాళ్ళ కుడా ఇలా ఆడితే 200 స్కోర్ ఈజీగా దాటేయచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే వరుణ్ చక్రవర్తి, చమిర,సుయాష్ శర్మ, వైభవ్ అరోరా,హర్షిత్ రానా లతో బాగానే కనిపిస్తుంది. కేకేఆర్ పంజాబ్ ను మట్టి కరిపిస్తుందనడంలో డౌటేలేదు.

పంజాబ్ కింగ్స్..

ఇక ఈ మ్యాచ్ కు శిఖర్ దావన్ దూరమవుతున్నాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే జానీ బెయిర్ స్టో, రిల్లే రూస్సో, శంశాక్ సింగ్, హర్ ప్రిత్ భాటియాలతో మంచి హిట్టర్లే ఉన్నారు. ఈ మ్యాచ్ లో వీరు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారీ స్కోర్ చేయచ్చు. బౌలింగ్ లో కేకేఆర్ తో పోలిస్తే వెనుకంజలోనే ఉంది. బౌలర్లు హర్ ప్రిత్ బ్రార్,హర్ష్ దీప్ సింగ్, కగిసో రబడా, ఇల్లిస్ లు కష్టపడితే కోల్ కత్తాను ఓడించడం పెద్డ కష్టమేమి కాదు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కేకేఆర్ ను ఎలా నిలువరిస్తుందో చూడాలి. 

కేకేఆర్ టీమ్ : ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రాఘవంషి, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (సి), ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

పంజాబ్ టీమ్ : సామ్ కర్రాన్ (సి), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలీ రోసోవ్, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికె), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.